NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అశోక్ నగర్ లో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఏలూరు ఎంపీ

1 min read

పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య

ఏలూరు జిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించలనే లక్ష్యంతో స్థానిక అశోక్ నగర్,కేపీడీటి ప్రాంగణం నందు శివగోపాల్ లూనాని ఆడిటోరియంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లాంచనంగా ప్రారంభించారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలతొ ముందస్తు వ్యాధులను పరీక్షల ద్వారా గమనించి మెరుగైన వైద్యం, చికిత్సలు అందించవచ్చని.అన్ని వర్గాల ప్రజలకు ఎంతో దోహదపడతాయన్నరు. ప్రారంభించిన వారిలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి). ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, క్లస్టర్ ఇంచార్జ్ నాయుడు సోము,నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, శనివారం పేట సొసైటీ బ్యాంకు చైర్మన్ కోనేరు వంశీ,తెలుగుదేశం పార్టీ నాయకులు పూజారి నిరంజన్, జూట్ మిల్ శ్రీను, మారం హనుమంతరావు, ఆర్​ఎన్​ఆర్​  నాగేశ్వరరావు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవసరమైన వ్యాధిగ్రస్తులకు మందులు అందించి వైద్య సలహాలను అందించారు.

About Author