భక్తుల కోలాహలం నడుమ వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం…
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ పట్టణంలో వెలసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం శనివారం సాయంత్రం వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ భక్తిశ్రద్ధలతో రథోత్సవాన్ని ప్రారంభించారు. శనివారం ఉదయం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ కి ఆలయ కమిటీ నిర్వాహకులు స్వాగతం పలికారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేకి పూలమాల శాలువాతో సత్కరించారు. సాయంకాలం రథోత్సవానికి ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ,సర్పంచ్ కొమ్ము దీపిక కొబ్బరికాయ కొట్టి రథోత్సవం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ వేడుకలను తిలకించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తేరుబజార్‌కు చేరుకున్నారు. అశేష జనవాహిని మధ్య పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వేడుక వైభవంగా సాగింది. రథం ముందుకు సాగుతుండగా భక్తులు రథంపై పూల వర్షం కురిపించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. ఈ కార్యక్రమంలో సాంబశివారెడ్డి, సురేష్ కుమార్, ప్రమోద్ కుమార్ రెడ్డి, ఎమ్మాఆర్ఓ , ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ కమిటీల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.


