NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఏలూరు ఎంపీ .. ఎమ్మెల్యే

1 min read

విష్యత్తులో విమాన ఇంధనంగా పామాయిల్,

‎పామాయిల్ ధరలు భారీగా పెరుగుతాయి

‎రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ సాగు చేయండి:ఎంపీ

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  :శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దెందులూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా దెందులూరు మండలం, చల్ల చింతలపూడి గ్రామంలో జరిగిన కార్యక్రమాల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామంలోని వేణుగోపాలస్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తమ నియోజకవర్గానికి, ఈ రోజు రావటం చాలా సంతోషం అని ఎమ్మెల్యే చింతమనేని అన్నారు. ‎ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తనకు శ్రీకృష్ణాష్టమి అంటే ఇష్టమని, ఈసారి ఇక్కడ గ్రామస్థులతో కలిసి  శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఏలూరు నియోజకవర్గంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు గత సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నట్లు గుర్తు చేసారు.ఈ సందర్భంగా గిట్టుబాటు ధర కోసం ఇబ్బందులు పడుతున్న పామాయిల్ రైతులకు శుభవార్త చెప్పారు ఎంపీ. విమాన ఇంధనంలో పామాయిల్ కలిపి వాడే విధంగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు విజయవంతం అయ్యాయని, వచ్చే 10-12 ఏళ్లలో విమాన ఇంధనంగా పామాయిల్ వాడే పరిస్థితి వస్తే ఆయిల్ పామ్ రైతుల కష్టాలు తీరిపోతాయని చెప్పారు. అప్పుడు ఆయిల్ పామ్ ధర టన్నుకు 50 వేలకు చేరే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని  రైతులు ఆయిల్ పామ్ పంటను విరివిగా సాగు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తో పాటు మండల పార్టీ కార్యదర్శి సత్యనారాయణ, జనసేన, బీజేపీ నేతలు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ప్రత్యేక పూజలో పాల్గొన్నరు.

About Author