శ్రావణమాసం నాలుగో వారం దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
1 min read

చెన్నూరు, న్యూస్ నేడు: చెన్నూరు మండల వ్యాప్తంగా శ్రావణమాసం నాలుగవ శనివారం కావడంతో ప్రధాన ఆలయాలు భక్తులతో పోటెత్తారు. చెన్నూరు బ్రాహ్మణ వీధిలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో తెల్లవారుజామున వేద పండితులచే ప్రత్యేక అభిషేక పూజలు పూల అలంకరణ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆంజనేయ స్వామి క్యూ కట్టారు. కమిటీ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చెన్నూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూలవిరాట్ వెంకటేశ్వర స్వామికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రక్కన ఉన్న ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు పూలు అలంకరణ నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. చెన్నూరు సమీపంలోని బుడ్డాయిపల్లి హైవే రోడ్డు ప్రక్కన వెలసిన శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు పూల అలంకరణ నిర్వహించారు. చెన్నూరు హైవే రోడ్డు సమీపంలో పెన్నా నది ఒడ్డున వెలసిన పెన్నా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనుపర్తి. రామనపల్లి వివిధ గ్రామాల్లో వలసిన ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


