శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఏలూరు ఎంపీ
1 min read

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి,స్వామి వారి శేష వస్త్రములు సమర్పించిన సహాయ కమిషనర్ ఆలయ కార్య నిర్వహణ అధికారిణి ఆర్.వి. చందన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జంగారెడ్డిగూడెంస్వయంభుగా వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని శుక్రవారం శ్రీ స్వామి వారి దర్శనార్ధం ఏలూరు పార్లమెంట్ సబ్యులు గౌరవ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ విచ్చేసినారు. వీరినికార్యనిర్వహణాధికారిణి వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, మంత్రోచారణతో ప్రదక్షణ గావించి శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు గావించినారు. అనంతరం వీరికి ఆలయ ముఖ మండపం నందు వేద ఆశీర్వచనం గావించి శ్రీ స్వామి వారి శేష వస్త్రములతో సత్కరించి స్వామి వారి చిత్ర పఠమును బహుకరించి ప్రసాదములు అందజేసినారని ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి. చందన తెల్పినారు.

