NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాదకద్రవ్య రహిత జిల్లాగా ఏలూరు ను రూపొందించాలి

1 min read

గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాల  కేసులలో పట్టుబడితే కఠిన శిక్షలు

ఉద్యోగాలకు, పాస్పోర్ట్ లకు  అనర్హత, శాశ్వత క్రిమినల్ రికార్డు, భవిష్యత్తు అంధకారం

యువత మాదకద్రవ్యాల జోలికి పోవద్దు… మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: యువత ఉజ్వల  భవిష్యత్తును  అంధకారం చేసే గంజాయి, డ్రగ్స్ వంటి  మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలనిజిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మాదకద్రవ్య రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను రూపొందించేందుకు సమాజంలోని ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు.గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు జోలికి వెళితే భవిష్యత్తు అంధకారమవుతుందని యువతలో అవగాహన కలిగించి,   యువత మాదకద్రవ్యాల జోలికి పోకుండా చూడాలన్నారు.  మాదకద్రవ్యాలతో పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవనన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఏఎస్పీ నక్కా సూర్యచంద్ర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జె. అమృతం, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమమ్మ, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాషా, ఎక్సయిజ్ శాఖ సూపరింటెండెంటు ఏ.ఆవులయ్య, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు బి.రామ కుమార్, జిల్లా ప్రజా రవాణాధికారి షబ్నమ్, ఈగిల్ టీమ్ ఇంచార్చి బి. ఉదయభాస్కర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author