ఈఎన్టి పీజీల ఓరియంటేషన్ సక్సెస్..
1 min read
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు: ENT పీజీల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎడిఎంఈ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ… వైద్య విద్యలో స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నరసమ్మ అన్నారు. ఆదివారం కర్నూలు మెడికల్ కాలేజీ లోని స్కిల్ ల్యాబ్ యందు ఈ ఎన్ టి విభాగపు AOI- AP చాప్టర్ ఆద్వర్యం లో ENT పీజీ లకు నిర్వహిస్తున్న ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పీజీ లందరూ తన స్కిల్స్ ని అప్డేట్ చేసుకుంటూ నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని కోరారు. మానవ శరీరంలో చెవి ముక్కు గొంతు అన్నవి ప్రధాన భాగాలని ఈ విభాగం ముందు ముందు కాలంలో మరింతగా రాణిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక నుంచి దాదాపు 55 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గెస్ట్ ఫ్యాకల్టీ డా.జి ఎస్ ఎన్ మూర్తి, డా. దుర్గ ప్రసాద్ ,ఇఎన్టీ ఏపీ స్టేట్ సర్జన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ బి జయప్రకాశ్ రెడ్డి కర్నూల్ డిస్టిక్ ప్రెసిడెంట్ డాక్టర్ మహేంద్ర కుమార్,hod డా. హరికృష్ణ, డా.శివప్రసాద్ రెడ్డి,డా. మనీరుద్దీన్ అహమ్మద్, డా.బానుమర్తి, డా. cv రావ్ సీనియర్ ఈఎన్టీ వైద్యులు పాల్గొన్నారు.



