అపార్ ఐడిని ప్రతి ఒక్కవిద్యార్థి కలిగిఉండేలా చూడాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: అకడమిక్ పాస్ పోర్టుగా ఉపయోగపడే అపార్ ఐడిని ప్రతి ఒక్కవిద్యార్థి కలిగిఉండేలా చూడాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య వి. వెంకటబసవరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నతవిద్యామండలి, నేషనల్ అకడమిక్ డిపాజిటరీ సహకారంతో యూనివర్సిటీ సెనేట్ హాలులో అపార్ క్రెడిట్ సీడింగ్ గురించి నిర్వహించిన ఒకరోజు వర్క్ షాపును ఆయన ప్రారంభించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం చేపట్టిన వన్ స్టూడెంట్ – వన్ ఐడి కార్యక్రమంలో భాగంగా అపార్ ఐడి, మరియు నేషనల్ అకడమిక్ డిపాడిటరీల ఏర్పాటు జరిగిందన్నారు. ఈ విషయంలో విద్యార్థులకు ఏ విధమైన సహాయం కావాలన్నా 1800 889 3511 టోల్ ఫ్రీ నెంబరును సంప్రదించవచ్చన్నారు. ఈ వర్క్ షాప్ లో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సి. వి. కృష్ణారెడ్డి, CDC డీన్ ఆచార్య పి.వి. సుందరానంద్, IQAC డైరెక్టర్ ఆచార్య ఆర్. భరత్ కుమార్ తోపాటు వివిధ శాఖల అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితోపాటు ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన 37 ఉన్నత విద్యాసంస్థలకాలనుండి 100 మంది వరకు నోడల్ అధికారులు పాల్గొన్నారు.

