రవాణా శాఖ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు
1 min read

అన్ని ప్రభుత్వ శాఖల సమయంతోనే రహదారి ప్రమాదాల సాధ్యం
జిల్లా అడిషనల్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు
ప్రతి పౌరుడు బాల్యం నుండే రహదారి భద్ర పై అవగాహన కలిగి ఉండాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రహదారి నియమాలను పాటించడంతో పాటుగా.అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయముతోనే రహదారి ప్రమాదాల నివారణ సాధ్యమని, ప్రతి పౌరుడు బాల్యం నుంచే రహదారి భద్రతా నియమాలపై తప్పక అవగాహన కలిగి ఉండాలని జిల్లా అడిషినల్ ఎస్పీ నక్కా సూర్య చంద్రరావు అన్నారు. శనివారం వట్లూరు సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో రవాణా శాఖ నిర్వహించిన 37 వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి సూర్య చంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ 1980 లో లార్డ్ మెకాలే రహదారి ప్రమాదాల్లో స్వల్ప గాయాలకు కారణమైన వారిపై సెక్షన్ 338, పెద్ద గాయాలకు కారణమైన వారిపై సెక్షన్ 304, 1980 లో మరణానికి కారణమైనవారిపై 304(A) అమలు చేసేవారని, తదనంతర కాలములో ఎం.వి. యాక్ట్ ను తీసుకు రావడం జరిగిందన్నారు. వాహనాన్ని తీసుకుని బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేవరకు ఇంటిలోని వారు భయపడుతూనే ఉంటారని, ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలు కోలుకోలేని దుస్థితికి వెళిపోతాయని, ప్రతిఒక్కరు రహదారి నియమాలు పాటిస్తూ సురక్ష్యంగా గమ్యానికి చేరుకోవాలి అన్నారు. రహదారి నియమాలను పాటించడంతో పాటుగా, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయముతోనే రహదారి ప్రమాదాలను నివారించగలమన్నారు.గత యాడాది జిల్లాలో 760 రహదారి ప్రమాదాలు జరగగా, 300 మంది చనిపోయారని, 430 మందిగా పైగా గాయాలపాలయ్యారన్నారు. ఇందులో అధికముగా ద్విచక్ర వాహనదారులే ఉన్నారన్నారు. శరీరములో ఎక్కడ గాయమైన కోలుకోడానికి అవకాశం ఉందని, తలకు గాయమైతే ప్రాణం పోతుందని అందువలన హెల్మెట్ ను తప్పక ధరించాలన్నారు. ప్రతి డ్రైవరుకు డ్రైవింగ్ లో తప్పక ఉండాల్సిది ఓపిక, సహనం అన్నారు. 3 టౌన్ సి.ఐ. కోటేశ్వరరావు, ఎస్.ఐ. రాంబాబు, వాహన తనిఖీ అధికారులు రమేష్ బాబు, వాహన తనిఖీ అధికారులు జి.ప్రసాదరావు, ఎన్.డి. విఠల్, జమీర్, సురేష్, జగదీశ్, స్వామి, నెహ్రు, కళ్యాణి, ప్రజ్ఞ, కళాశాల ప్రిన్సిపాల్, ఆర్టీసీ డిపిటిఓ ఎస్.కె. షాబాన్, ఏం.డి. బి.వాణి, కలశాల బస్సు డ్రైవర్లు, విద్యార్థులు ఎన్.సి.సి. విద్యార్థులు, ఆర్టీసీ డ్రైవర్లు పాల్గొన్నారు.


