NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాలం చెల్లిన మందులు గుర్తించి..వినియోగం ఆపాలి..

1 min read

హొళగుంద న్యూస్ నేడు : జూలై 31న హొళగుంద మండల కేంద్రంలో కాలం చెల్లిన మందులు ఇస్తున్నారు అని ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురితమైంది. ఈ విషయానికి సంబంధించి  డిప్యూటీ డిఎంహెచ్​ఓ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు విచ్చేసిన సందర్భంగా మండలంలోని కూటమి నాయకులు కన్వీనర్ వీరన్ గౌడ   జనసేన కన్వీనర్ అశోక్  ఇతర నాయకులతో కలిసి డిప్యూటీ డిఎంహెచ్​ఓ ని వివరణ కోరడం జరిగింది. ఈ విషయం పై వీరన్న గౌడ మాట్లాడుతూ పేద ప్రజల  ఆరోగ్యాలతో ఆటలాడుకోకూడదని గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చేవాళ్ళు బడుగు బలహీన వర్గాలు ఉంటారని వారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని రోగుల ప్రాణాలు మీ చేతుల్లో ఉంటాయని ప్రతినెల కాలం చెల్లిన మందులను గుర్తించి వాటిని తొలగించాలని హాస్పిటల్ సిబ్బందికి మరియు డిప్యూటీ డిఎంహెచ్​ఓ డాక్టర్ న్యూటన్ కు  చెప్పడం జరిగింది.     ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు సుభాన్, జమాపూర్ బసవ, రాజా, హుసేన్ పీరా, కోగిలతోట జాకిర్, ముల్లా మొయిన్, చాకలి ఉలుగన్న, కురువ మల్లికార్జున, దిడ్డి మల్లికార్జున మరియు అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author