బిషప్ పొలిమేర జయరావు పై అసత్యఆరోపణలు మానుకోవాలి
1 min read

దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జువరపు రవి ప్రకాష్ , నాయకులు హెచ్చరిక
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఏలూరు నగరం దళిత సేన రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులుజిజ్జువరపు రవిప్రకాష్ మాట్లాడుతూ దేవుని సేవయే ప్రధాన ధ్యేయముగా పనిచేస్తూ రాష్ట్రంలోనే క్రైస్తవ సమాజంలో విశిష్ట ఘనత కలిగిన ఎటువంటిమచ్చలేని నిష్కలంకం గలిగిన ప్రేమ కలిగిన దేవుని ప్రతినిధి ఏలూరుపిఠాధిపతి మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావు పై ఇటీవల కొంతమంది చేస్తున్న అసత్యపు ఆరోపణలను దళిత సేన తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఇటువంటి అసత్యపు ఆరోపణలను మానుకోవాలని చేతనైతే దేవుని కి క్రైస్తవ సమాజానికి సేవ చేయాలని అంతేగాని దేవునికి ప్రతినిధిగా ఉండి దేవుని సేవ చేస్తున్న బిషప్ పై స్వలాభం కోసం స్వార్థం కోసం మెప్పుకోసం చేసే దుర్మార్గపు ఆరోపణలను దళిత సేన తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఇటువంటి ఆరోపణలు మరొకసారి చేస్తే తీవ్ర ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించారు ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా దళిత సేన అధ్యక్షులు చీలి మోహనరావు, తూర్పుగోదావరి జిల్లా దళిత సేన అధ్యక్షులు దిరుసు పాము కృష్ణమూర్తి పాల్గొన్నారు.

