NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో  ఎరువులు

1 min read

రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు

జిల్లా వ్యవసాయాధికారి ఎస్.కె.హబీబ్ భాషా

పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తామని,ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.కె. హబీబ్ బాషా విజ్ఞప్తి చేశారు.  జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో పోలవరం మండలం ప్రగడపల్లి, వింజరo లోని ప్రాధమిక వ్యవసాయ సహకార సొసైటీలో ఎరువుల పంపిణీని హబీబ్ భాషా పరిశీలించారు.ఈ సందర్భంగా హబీబ్ భాషా మాట్లాడుతూ ప్రగడపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార సొసైటీ లో మంగళవారం ఒకరోజునే 62.50  టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశారని, బుధవారం ఉదయం 39 టన్నుల ఎరువులు నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. బుధవారం సాయంత్రం మరో 25 మెట్రిక్ టన్నులు యూరియా తాడేపల్లిగూడెం నుంచి వస్తున్నాయన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వారు కేవలం మూడు గంటల వ్యవధిలో 50 టన్నుల యూరియా లారీలతో పాటు వాటిని దిగుమతి చేసేందుకు కార్మికులను కూడా పంపడం జరిగిందన్నారు.అదేవిధంగా  వింజరం లో కూడా ప్రతీ రైతు అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందులో చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దుని హబీబ్ భాషా విజ్ఞప్తి చేశారు.  జిల్లా కలెక్టర్ వారు   జిల్లాలోని రైతుల ఎరువుల అవసరాలను  ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునీ,  రైతుల అవసరాల మేరకు అవసరమైన ఎరువులు సరఫరా అయ్యేలా చేస్తున్నారన్నారు.  మండల స్థాయిలోను, సొసైటీలలలోనూ వారం నకు అవసరమైన ఎరువులను ముందుగానే తెలుసుకుని వాటి సరఫరాకు చర్యలను తీసుకుంటున్నారన్నారు.  ఈ సందర్భంగా సొసైటీలో ఉన్న ఎరువుల నిల్వలు, పంపిణీని హబీబ్ భాషా పరిశీలించారు. జిల్లాలో యూరియా, ఎరువులకు ఎటువంటి  లేదని ప్రతీ రైతుకు వారి అవసరాలకు తగినవిధంగా ఎరువులు అందిస్తామన్నారు.  రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు.రైతులకు యూరియా సరఫరా లో జిల్లా జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను పలువు రైతులు అభినందించారూ.వారివెంట వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజబాబు తదితరులు ఉన్నారు.

About Author