NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ భక్త కనకదాసు విగ్రహం చేయి విరగొట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలి

1 min read

కర్నూలు జిల్లా కురువ సంఘం డిమాండ్….

కర్నూలు, న్యూస్ నేడు: ఆలూరు మండలం మనేకుర్తి గ్రామం లో కురువల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు విగ్రహానికి గత రాత్రి చెయ్యి విరగగొట్టిన  దుండగులను గుర్తించి  కఠినంగా శిక్షించాలని కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ బి వెంకటేశ్వర్లు జిల్లా  కోశాధికారి కే. సి.నాగన్న, జిల్లా మహిళా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి శ్రీలీలమ్మ, కె. అనితమ్మ నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు, బి. రామకృష్ణ పుల్లన్న, దేవేంద్ర, బి. సి. తిరుపాల్ డిమాండ్ చేసారు.పై సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.

About Author