NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే199వ జయంతి వేడుకలు

1 min read

విద్య లేక పోతే మతి తప్పుతుంది, మతి లేక పోతే నీతి తప్పుతుంది – నీతి లేకపోతే వ్యవస్థ గతి తప్పుతుంది

అజ్ఞానమే అన్ని అనర్థాలకు మూల కారణం – విద్య ద్వారానే దానీకి పరిష్కారం

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అజ్ఞానమే అన్ని అనర్థాలకు మూల కారణమని, విద్య ద్వారానే దాన్ని పరిష్కరించగలమంటు.  మహాత్మ జ్యోతిరావ్ పూలే చెప్పిన మంచి మాటలను మననం తూచా తప్పకుండా పాటించాలని  దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ అన్నారు.మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఏలూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొని జ్యోతిరావు పూలే  చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ నివాళులర్పించారు. కార్యక్రమానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ కి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “సామాజిక విప్లవ పితామహుడు, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావ్ పూలే  199వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా ఘన నివాళులు. సతీసమేతంగా (సావిత్రీబాయి పూలే తో కలిసి) సమాజంలోని చీకట్లను పారద్రోలడానికి కంకణం కట్టుకున్న గొప్ప సంస్కర్త పూలే అని అన్నారు.సమాజంలో అస్పృశ్యత, కుల వివక్షను రూపుమాపడానికి సత్యశోధక సమాజ్ స్థాపించి అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారు అని, పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని ప్రసాదించిన మహనీయుడు పూలే అని కొనియాడారు.మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేయడం మాత్రమే నివాళి కాదు అని, వారి ఆశయాలను మన గుండెల్లో నింపుకుని, పేదలకు సేవ చేయడమే నిజమైన నివాళి అని దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న యువత, విద్యార్థులతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మమేకమయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొప్పనసుధ, దెందులూరు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని, పోతునూరు సొసైటీ చైర్మన్ బొడ్డేటి మోహన్, బాయి రాంప్రసాద్ సహా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *