సెయింట్ పౌలు కథోలిక దేవాలయం ప్రారంభోత్సవం
1 min read

నేనీ మందిరమునెన్నుకొని దీనిని పవిత్రపరచితిని,ఇచట నాకెల్లకాలమును పూజలు జరుగవలయుననియే నా కోరిక
నేను కలకాలము ఈ మందిరమును ఆదరాభిమానములతో పరామర్శించుచుందును, సంరక్షించుచుందును
సెయింట్ పౌలు కథోలిక నూతన దేవాలయం ప్రారంభం
ప్రారంభించిన బిషప్ జయరావు పొలిమేర డి డి
ముఖ్యఅతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు నియోజకవర్గం,పెదవేగి మండలం పెనకడిగి గ్రామంలో సెయింట్ పౌలు కథోలిక దేవాలయం ఏలూరు పీఠాధిపతులు బిషప్ జయరావు పొలిమేర డిడి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు.ఈ దేవాలయము కృతజ్ఞతా జ్ఞాపికగా నా షష్ఠిపూర్తి (60 సంవత్సరాల) ఆయుష్షునకు,సమృద్ధి బహుమానములకు ఆనందపూర్వక స్తోత్రాంజలి సమర్పిస్తూ నిర్మించమడినదిచిరు పూర్వగాధ:పినకడిమి అనే చిన్న గ్రామము పచ్చని పొలాల, మామిడి,జామతోటలతో కూడినప్రకృతి ఒడిలో ఒదిగియున్న గ్రామము. సహజసిద్ధమగు తమ్మిలేరు పాయ నిరంతర నీటి ప్రవాహపు ఒడ్డున వెలసినది. పినకడిమి ఆ గ్రామ ముఖ ద్వారమును అంటిపెట్టుకొని ఉన్నది హోలీ ల్యాండ్ పుణ్యక్షేత్రము. అంతేగాదు ఏలూరు పీఠం సెయింట్ జాన్స్ మైనర్ సెమినరీకి చేరువలో నున్న గ్రామమిది. పది సంవత్సరాల పరిచయము, సువార్త ప్రభోధము కొనసాగించిన పిదప దేవుని కృపతో పది కుటుంబాల వారు కతోలిక విశ్వాసమును స్వీకరించారు. స్వర్గీయ రెవ. ఫా: సిల్వియో పాస్క్వాలి పేర ఏర్పాటు చేయబడిన (సి.యస్.ఎ) కేటకిటిల్ సిస్టర్స్ ఆఫ్ సిస్టర్స్ సెయింట్ ఆన్స్ సభకు చెందిన మరకన్యలు మరియు స్వర్గీయ సరిపల్లి కుటుంబరావు ప్రశంసనీయమైన సత్యోపదేశ భోదనలవల్ల పది కుటుంబాలవారు ప్రభువులో బాప్తిస్మ భాగ్యము పొందినారు. అంతేకాదు దేవుని ప్రత్యేకత కృపవల్ల ఆ గ్రామపు సానుకూల ప్రదేశములో దేవాలయము నిర్మించుటకు చక్కని స్థలము చేకూరినది. వెదజల్లబడిన ప్రభు సువార్త బీజములు మొలకెత్తి దినదిన ప్రవర్ధమానముగా పెరుగుచున్నవి. గనుక ఈ చిన్న సంఘము ప్రభువు ద్రాక్షతోటగా వికసించి,పుష్పించి ఫలభరితమగునట్లుగా ప్రార్ధించమని రెవ. ఫాదర్:డా:ఇంజే పౌలుమరియు పెనకడిమి కథోలిక సంఘవిశ్వాసులు కోరుచున్నారన్నారు.


