సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం
1 min read
హొళగుంద న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు.హొళగుంద మండలం,హెబ్బటం గ్రామం నందు జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలోహెబ్బటం గ్రామంలో నిర్వహించిన “సుపరిపాలన లో తొలి అడుగు” కార్యక్రమంలో టీడీపీ యూనిట్ ఇంచార్జ్ B. సవారప్ప, బూత్ ఇంచార్జ్ లు, మల్లికార్జున, గోపాల్, శేక్షవాలి, పూజారి పాటయ్య, బీజేపీ కాళప్ప, మాణిక్య, క్రిష్ణ,గారు పాల్గొన్నారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హమీలన్నీ నెరవేరుస్తున్నారని, త్వరలో మరిన్ని సంక్షేమ పధకాలు అమలు కానున్నాయని, ప్రజలంతా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

