NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి

1 min read

సంజీవ్ నగర్ ప్రాంతం మక్కా మసీద్ కాలనీలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ వినతి: ఏపీ మహిళా సమాఖ్య ( ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ)

ఎమ్మిగనూరు   న్యూస్ నేడు:   ఎమ్మినూరు పట్టణంలో సంజీవి నగర్ సమీపంలో ఉన్న మక్కా మసీద్ దగ్గర లో ఉన్న కాలనీవాసులకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తక్షణమే త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రోజున ఏపీ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐ డబ్ల్యు) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఏపీ మహిళా సమాఖ్య పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వాణి, ఈరమ్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంజీవ్ నగర్ ప్రాంతంలో నీటి కొరత అధికంగా ఉందని గత కొన్ని సంవత్సరాల నుండి ఆ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ కాలనీకి సంబంధించి ఎటువంటి తాగినీటి పైప్ లైన్ లేక బోరు  నీళ్లను తాగడం వల్ల అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలవుతున్నారని వారు తెలిపారు. స్పెషల్ గ్రేడ్ వన్ స్థాయి మున్సిపాలిటీ నీటి సమస్య ఉండడం బాధాకరమని, కానీ ఆ కాలనీ ప్రజలుకు ఎటువంటి సదుపాయాలు లేకపోయినా మున్సిపాలిటీ పనులు చెల్లిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.కాబట్టి తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి తాత్కాలికంగా ఆ కాలనీకి మూడు రోజులకు ఒకసారి తాగినీటి వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి కాలనీ ప్రజలను ఆదుకోవాలని వారు తెలిపారు. లేనిపక్షంలో కాలనీ ప్రజలతో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమాఖ్య కార్యకర్తలు రాములమ్మ, రమీజా, షబానా, శ్యామలమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About Author