సీఎంఆర్ మల్టీప్లెక్స్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
1 min read

నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కె.వెంకటరత్నం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : న్యూ బస్టాండు ఎదురుగా సిఎంఆర్ మాల్ (మల్టీప్లెక్స్) లో తినుబండారాల స్టాల్స్ ని ఆకస్మిక తనిఖీలు ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా పలుసార్లు వినియోగిoచిన వంటనూనె గుర్తించిన అధికారులు. వినియోగదారుల ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దని, ఆ విధంగా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.తనిఖీలలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కె.వెంకట రత్నం,ఫుడ్ సేఫ్టీ అధికారి రామరాజు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.


