యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం
1 min read

నందికొట్కూర్ వైసీపీ ఇన్చార్జ్ డాక్టర్ సుధీర్..
నందికొట్కూరు, న్యూస్ నేడు: రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో డాక్టర్ సుధీర్ స్వగృహంలో బుధవారం ఉదయం జరిగిన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ సుదీర్ మాట్లాడుతూ రైతులు ఏ పంట వేయాలన్నా యూరియా తప్పనిసరిగా పొలంలో వేయాల్సిందేనని యూరియా వేయకపోతే పంట దిగుబడి రాదని కేంద్రం నుండి యూరియా తెప్పించుకోలేక పోతున్నారని వచ్చిన యూరియా వారి నాయకుల ఇళ్లల్లో పెట్టుకుంటూ ఉన్నారని ఆయన అన్నారు.ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతూ సంతోషంగా లేరని వారికి నచ్చిన వారికే యూరియా ఇస్తున్నారని మండిపడ్డారు.రైతుల పక్షాన పార్టీ అండగా ఉంటుందని రైతులకు యూరియా అందించలేకపోతుంటే రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్త శుద్ధి ఉందో అర్థం అవుతుందని గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని ప్రస్తుతం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా గొప్పలుగా చెబుతున్నారని అన్నారు.రైతుల సమస్యలపై ఈనెల 9వ తేదీన ఆత్మకూరు ఆర్డీవోకు మెమొరండం ఇవ్వడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ సుధీర్ కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మన్సూర్,జడ్పిటీసీ జగదీశ్వర్ రెడ్డి,పుల్యాల నాగిరెడ్డి,చిన్న మల్లారెడ్డి,లోకేశ్వర్ రెడ్డి, అన్వర్ భాష,నబి రసూల్ తదితరులు పాల్గొన్నారు.

