NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అయ్యప్ప స్వామి మాలధారుల  (భిక్ష) కార్యక్రమంలో  మాజీ ఎంపీ దంపతులు

1 min read

ఎమ్మిగనూరు, న్యూస్ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో  శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మాలధారుల అన్నదానం (భిక్ష) కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక భర్తతో కలిసి పాల్గొన్నారు.మంత్రోచ్చారణల నాదం, దీపారాధనల వెలుగు మధ్య స్వామివారి దివ్య సన్నిధిలో భక్తి వినయాలతో దర్శనం చేసుకున్న శ్రీమతి బుట్టా రేణుక , ఆమె భర్త వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బుట్టా శివ నీలకంఠ  స్వామివారికి శరణాగతి చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొని దివ్య ఆశీస్సులు పొందారు.అనంతరం, అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వామివార్లకు అంకితంగా నిర్వహిస్తున్న 11 రోజుల అన్నదాన (భిక్షా) మహాయజ్ఞంలో భాగంగా స్వయంగా అన్నప్రసాదాలు వడ్డిస్తూ “సేవే భక్తి” అనే సనాతన భావనను ఆచరణలో నిలిపారు.ఈ పవిత్ర ఘట్టాలు అక్కడున్న ప్రతి భక్తుడి హృదయంలో ఆధ్యాత్మిక ఆనందం, శాంతి, ధర్మస్ఫూర్తిని నింపాయి.ఈ దివ్య కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని “స్వామియే శరణం అయ్యప్ప” నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణంలో స్వామివారి కరుణా కటాక్షాన్ని అనుభవించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహమ్మద్ గారు,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, జిల్లా చేనేత అధ్యక్షులు శివప్రసాద్, జిల్లా ఎస్సి సెల్ కార్యవర్గ సభ్యులు కొరిశెట్టి మధు బాబు, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు మహాబూబ్ బేగ్,26వ వార్డు కౌన్సిలర్ & నియోజకవర్గ చేనేత అధ్యక్షులు మీసాల బండ నీలకంఠ, 15వ వార్డ్ ఇంచార్జ్ సయ్యద్ ఫయాజ్, పట్టణ యువజన విభాగ అధ్యక్షులు బోయ రాజు, ఎమ్మిగనూరు మండల యువజన విభాగ అధ్యక్షులు బి. బసిరెడ్డి, సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్, 29 వ వార్డు నాయకులు నరసింహులు, 5వ వార్డు నాయకులు ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు. 

About Author