NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సేవా కార్యక్రమాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: పేద  మరియు అనాధ పిల్లల సంక్షేమానికి అందరూ ముందుకు రావాలని సేవ చేయడమే నిజమైన మానవత్వం అని నేడు జరిగిన అభయగిరిలోని బాధిత పిల్లలకు  ఉచిత బట్టలు మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు .ఈ సేవా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సి.ఐ.డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీ .పెద్దయ్య నాయుడు మాట్లాడుతూ బాలల విద్యా ఆరోగ్యం భవిష్యత్తు పట్ల  సమాజం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు అవసరమైన స్పోర్ట్స్ కిట్లను తనవంతుగా త్వరలో అందజేయన్నట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ మెంబర్ ,జిల్లా చైల్డ్ కేర్  ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్ కమిటీ మెంబర్ లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయని, చిన్నారుల భవిష్యత్తుకై మనమందరం  సహాయ సహకారాలు అందించాలన్నారు .లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ గౌరవాధ్యక్షులు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి లయన్ కే.డీ.జే బాబు మాట్లాడుతూ పిల్లలకు అవసరమైన వస్త్రాలు రెండు నెలలకు సరిపడా నిత్యవసర వస్తువులను అందజేయడం జరిగిందని బాధిత పిల్లల పట్ల ఆప్యాయతతో పాటు అవసరమైన సహాయం అందించడం మనందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో సుమారు 50వేల రూపాయలు విలువైన వస్త్రాలు ,నిత్యవసర సరుకులు  బాధిత పిల్లలకు అందజేశారు ఈ సేవా కార్యక్రమంలో నవమణి, ఉపాధ్యాయురాలు చిన్నమ్మబాయి ,మెర్సీ హోం లెప్రసీ  అండ్ ఎయిడ్స్ సెంటర్ ఇన్చార్జి సిస్టర్ సారంగా, మరియు సిస్టర్ సిని,దివ్య తదితరులు పాల్గొన్నారు.

About Author