వైయస్ఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన మండల పార్టీ శ్రేణులు
1 min read

ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందవరం మండల అధ్యక్షులు జే.శివారెడ్డి గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రజాహృదయ సమ్రాట్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని ఘనంగా ఆచరించారు. 2009లో హఠాత్తుగా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించినా, ఆయన జ్ఞాపకాలు, సేవా భావం ఈ రోజూ కోట్లాది ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నాయి.ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జే.శివారెడ్డి గౌడ్,రాష్ట్ర మేధావుల ఫోరం సంయుక్త కార్యదర్శి కె.ఆర్ లక్ష్మి కాంత్ రెడ్డి,రాష్ట్ర బిసి సెల్ సంయుక్త కార్యదర్శి విరూపాక్షి రెడ్డి,మండల సీనియర్ నాయకులు కె.ఆర్.రామకోటేశ్వర్ రెడ్డి మరియు పార్టీ మండల కమిటీ సభ్యులు,అనుబంధ విభాగాల రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ,మండల,గ్రామ కమిటీ సభ్యులు,జెట్పిటీసీ,ఎంపీటీసీలు,సర్మంచులు,వార్డు మెంబర్లు,ఉప సర్పంచులు,మండల నాయకులు, కార్యకర్తలు అందరు కలసి వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.సంక్షేమం, అభివృద్ధికి వైయస్ఆర్ నాంది ప్రజల పేదరిక నిర్మూలన కోసం వైయస్ఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగుని నింపాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు వంటి పథకాలతో పేదలకు ఆధారంగా నిలిచారు. రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం పెంచడానికి చేపట్టిన “జలయజ్ఞం” ప్రాజెక్టులు, పోలవరం, హంద్రీ-నీవా, గలేరు-నగరి వంటి పథకాల రూపకల్పన ఆయన దూరదృష్టికి నిదర్శనం.వైయస్ఆర్ చూపిన దారిలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాములో పాలన ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్షంగా ‘అమ్మఒడి’, ‘రైతు భరోసా’, ‘నాడు-నేడు’ వంటి పథకాలు వైయస్ ఆర్ ఆలోచనలకు కొనసాగింపని వారు తెలిపారు.వైయస్ఆర్ మరణవార్త తెలిసి అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారని, ఆయనకు ఊరు ఊరునా విగ్రహాలు ప్రతిష్ఠించబడటం ఆయనపై ప్రజల ప్రేమకు నిదర్శనమని పార్టీ నాయకులు అన్నారు. ఆయనను దేవుడిగా కొలుస్తున్న ప్రజల ఆశీర్వాదంతో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది అని పేర్కొన్నారు.

