NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దివ్యాంగుల కు పూర్తిగా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు కృతఙ్ఞతలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  తెలుగుదేశం పార్టి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధ్యక్షులు  ఎల్లప్ప , ఆర్టీసి జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ  శ్రీనివాసులు ని తన చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసి,  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, దివ్యాంగుల ఉచిత ప్రయాణానికి ఉద్దేశ్యించిన “దివ్యాంగ శక్తి పథకం”ను తేది: 18.03.2026 న కర్నూలు బస్ స్టేషన్ నందు జిల్లా కలెక్టరు  చేతుల మీదుగా ప్రారంభింప చేయుటలో విశేష కృషి చేసినందుకు, కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కర్నూలు-1 డిపో మేనేజరు శ్రీమతి సుధారాణి కి, అలాగే కర్నూలు-2 డిపో మేనేజరు శ్రీ నాగభూపాల్ కి కూడా కృతఙ్ఞతలు తెలియజేశారు. గతంలో దివ్యాంగులు 50% చార్జితో ప్రయాణించేవారని, కాని ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకంతో, 40% శాతం Disability కలిగిన దివ్యాంగులు పూర్తిగా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు, ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా దివ్యాంగులలో మనోస్థైర్యాన్ని కలుగుజేసినందుకు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం వారికి ఎంతో మేలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి కూడా కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి శ్రీ కే.కృష్ణుడు , తెలుగుదేశం పార్టి విభిన్న ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షులు శ్రీ కే.మద్దిలేటి , జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ యం.మద్దిలేటి , నగర కమిటీ ప్రధాన కార్యదర్శులు శ్రీ శ్రీరాములు, నర్సింహులు, రజాక్ ల, కోడుమూరు మండల అధ్యక్షులు శ్రీ రాజశేఖర్ ల పాల్గొన్నారు.

About Author