NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగులకు పనిభారం శాపంగా మారకూడదు

1 min read

పనిభారం వద్దని రెవెన్యూ ఉద్యోగుల నిరసన..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  రెవెన్యూ ఉద్యోగులకు పనిభారం శాపంగా మారకూడదని కర్నూలు జిల్లా ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రెటరీ ఆర్ నరసరాజు అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకురెవెన్యూ ఉద్యోగులు బుధవారం నలబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా నరసరాజు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు అధిక పని భారం ఉండటం వల్ల నలిగిపోతున్నామని వీఆర్వోలు సర్వేయర్లు తదితర రెవెన్యూ సిబ్బందికి అధిక పని భారం వల్ల మనస్థాపానికి గురవుతున్నారు.పనిభారం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురౌతున్నారు.ఫీల్డ్ లో పనిచేస్తున్న ఉద్యోగులపై పని భారం ఎక్కువగా ఉంది. అర్జీలను పరిష్కరించేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలి. పని ఒత్తిడి భారం తగ్గించాలి ఇతర శాఖల విత్తనాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.కామన్ డిడిఓ తహసిల్దార్ గా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి.రీసర్వే కు వెసులుబాటు కల్పించాలి.క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలి గానీ శాపంగా మారకూడదన్నారు.గతంలో ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ భూ సమస్యలు పరిష్కారం అవుతూనే ఉన్నాయని రెవెన్యూకు సంబంధించిన 64 రకాల విధులు నిర్వహిస్తుంటే ఇవి కాకుండా ఇతర శాఖల పనులను కూడా మాపై ఒత్తిడి చేయడం పద్ధతి కాదని నర్సరాజు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ మహమ్మద్ హుస్సేన్, సీనియర్ అసిస్టెంట్ శ్యామల, రాజశేఖర్,విఆర్వోలు వెంకటేష్,మనోహర్,సామన్న, సుజాత,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

About Author