NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే చొరవతో తెలంగాణ వైపు వెళ్లే బస్సులకు ఉచిత టికెట్

1 min read

కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది

ఎమ్మెల్యే రోషన్ కుమార్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ ​నేడు  : చింతలపూడి మీద అశ్వరావుపేట వెళ్ళే బస్సులకు ఆంధ్రా సరిహద్దు వరకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం పై ప్రభుత్వం వెసులుబాటు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ చొరవతో ప్రభుత్వం అవకాశం కల్పించింది.తెలంగాణ వైపు వెళ్లే బస్సులకు ఉచిత బస్సు ప్రయాణ వర్తించడం లేదని  శాసనసభ్యులు రోషన్ కుమార్ దృష్టికి కొందరు ప్రయాణికులు తీసుకొచ్చిన నేపథ్యంలో శాసనసభ్యులు జిల్లా  సమీక్ష మండలి సమావేశంలో ఈ విషయం ప్రస్తావించి రవాణా శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఆంధ్ర సరిహద్దు వరకు ఉచిత ప్రయాణ టికెట్ వర్తింపజేశారు.సత్తుపల్లి వెళ్లే బస్సులకు కూడాలో త్వరలో ఈ వెసులుబాటు కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. మహిళా ప్రయాణికులు  ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు.

About Author