NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గన్మాతా  నమో నమః

1 min read

దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు  ప్రారంభం..

ప్రత్యేక మండపాల్లో కొలువుదీరిన దుర్గమ్మ..

ఓర్వకల్లు, న్యూస్ నేడు: అమ్మలగన్న అమ్మ.. ఆదిపరాశక్తి ఊరూరా కొలువుదీరింది. దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు మండలంలో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.గ్రామాల్లో, వీధుల్లో చలువ పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసి దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించి, కలశస్థాపన చేశారు. అమ్మవారి ఆల యాలను సుందరంగా ముస్తాబు చేశారు.తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్న  దేవీ శరన్నవరాత్రులు మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని మొదటిరోజు బాలాత్రిపుర సుందరి దేవిగా అత్యంత సుందరంగా అలంకరించారు.వేదపండితుల మంత్రోచ్చరణలతో మంగళవాయిద్యాలతో అమ్మవారికి  కుంకుమార్చనలతో విశేష పూజలు నిర్వహించారు.హుసేనాపురం గ్రామంలో  రాములోరి దేవస్థానంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహానికి పురోహితులు జంధ్యాల మనోహర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడు, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లొద్దిపల్లి గ్రామంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహం ముందు దుర్గమ్మ గుడి నమూనా భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

About Author