అర్జీ దారులను తిప్పించుకోవద్దు
1 min read

చేయగలిగిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ప్రజల నుండి పాజిటివ్ స్పందన వచ్చేలా ప్రభుత్వ సేవలు అందించాలి
హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: అర్జీ దారులను పది సార్లు తిప్పించుకోవద్దని, చేయగలిగిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక సంబంధం కాని సమస్యలు, చేయగలిగిన సమస్యల పరిష్కారం లో ఏ మాత్రం జాప్యం చేయకూడదని అధికారులను ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడి చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొండయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

