NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలులో కలుపుటకు పార్టీలు నివేదిక ఇవ్వాలి..

1 min read

సీపీఐ ఎంఎల్ పార్టీ డిమాండ్..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పార్టీ కార్యాలయంలో బుధవారం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నందికొట్కూరు ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి కేవలం 30 కి.మీ దూరంలో ఉన్న కర్నూలు జిల్లాకు కాకుండా 70.కి.మీ దూరంలో ఉన్న నంద్యాల జిల్లాకు కలపడం వల్ల రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం పరిపాలనా సౌలభ్యం కోసం,విద్యా,ఉపాధి అవకాశాల కోసం, నందికొట్కూరును కర్నూలు జిల్లాతో అనుసంధానం చేయాల్సిన అత్యవసరం ఉందని వారు పేర్కొన్నారు. కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు,ఉద్యోగ అవకాశాలు ఇక్కడి ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటాయని అన్నారు.నియోజకవర్గంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో తెలియచేయాలని అదేవిధంగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి,ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం తాలూకా అధ్యక్షులు గాబ్రియేల్,మిడుతూరు మండల కార్యదర్శి మేకల శేఖర్,నాగరాజు,సుధాకర్ పాల్గొన్నారు.

About Author