బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి..
1 min read

పగిడ్యాల’లో ఘనంగా బాలికల దినోత్సవం..
నందికొట్కూరు , న్యూస్ నేడు: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని పగిడ్యాల జడ్పిటీసీ పుల్యాల దివ్య అన్నారు.నంద్యాల జిల్లా పగిడ్యాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం అంగన్ వాడీ సూపర్ వైజర్ శేషమ్మ అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి దర్గయ్య, ఎంపీడీవో సుమిత్రమ్మ,ఎంఈఓ సుభాన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పిన విధంగా మంచిగా చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.బాలికలు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఒక లక్ష్యంతో మీరు చక్కగా చదివితే అనుకున్నది సాధిస్తారని అంతేకాకుండా బాలికలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకొని చదవాలని వారు విద్యార్థులకు సూచించారు.బాల్య వివాహాలు,లింగ వివక్షత మొదలగు వాటి గురించి వ్యాసరచన నిర్వహించి మంచి ప్రతిభ కనబరిచిన బాలికలకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ మురళీ,ఏపీఎం చంద్రకళ,ఏఎస్సై వెంకట శేషాద్రి,మిడుతూరు సూపర్వైజర్ వెంకటలక్ష్మి, ఎంఎల్ హెచ్పి లు మాధవి, రాజు,ఎంఎస్ కే నళిని, విద్యార్థులు పాల్గొన్నారు.

