రాష్ట్రవ్యాప్తంగా “రచ్చబండ – కోటి సంతకాల సేకరణ” ఉద్యమం ప్రారంభం
1 min read

ఎమ్మిగనూరు న్యూస్ నేడు ఎమ్మిగనూరు : నియోజకవర్గం లో నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక, బుట్టా శివ నీలకంఠ లఆధ్వర్యంలో రచ్చబండ – కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభం ఎమ్మిగనూరు పట్టణంలోని శిల్పా ఎస్టేట్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమీపంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక , పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బుట్టా శివ నీలకంఠ , ఆధ్వర్యంలో ప్రజా హక్కులను కాపాడే ఉద్యమంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “రచ్చబండ – కోటి సంతకాల సేకరణ” కార్యక్రమం భాగంగా, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈ రోజు ప్రారంభించడం జరిగింది.రాష్ట్రంలోని వైద్య విద్యా రంగం ప్రైవేట్ బంధువుల హస్తగతం కానీయాలన్న ఉద్దేశ్యంతో ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పి.పి.పి. (పబ్లిక్ ప్రవేట్ పార్ట్నర్షిప్ ) విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించి, లాభదాయక రంగంగా మార్చేయత్నం చేస్తోంది.ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019–2024 మధ్యకాలంలో రూ. 8,000 కోట్లతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టి, వైద్య విద్య, వైద్యం గ్రామీణ ప్రాంతాలకు చేరేలా ప్రణాళికలు అమలు చేశారు.ఆయన హయాంలో ఏడు కళాశాలలు పూర్తి కాగా, మరిన్ని ఐదు కళాశాలలు పూర్తయి ప్రారంభ దశకు సిద్ధంగా ఉన్నప్పుడు, ఎన్నికల నియమావళి కారణంగా ప్రారంభం కాలేకపోయాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ ఆస్తులను ప్రైవేటు చేతుల్లోకి బదిలీ చేయడానికి ప్రణాళికలు రూపొందించడం ప్రజల వైద్య హక్కులపై దాడిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తోంది.“ప్రతి నాయకుడి విజన్ అంటే ప్రజలకు మేలు చేయడం అని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ప్రజల ఆరోగ్య హక్కు, వైద్య విద్య అందరికీ చేరడం కానీ నేడు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా ఆస్తులను బినామీల చేతుల్లోకి ఇవ్వడం విజన్ కాదు అది దోపిడీ,ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పి.పి.పి. మోడల్ పేరుతో ప్రైవేట్ చేసేయడం అంటే పేదల వైద్య విద్యను, వైద్య సేవలను దూరం చేయడం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కుట్రలకు అడ్డుకట్ట వేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలను సేకరించి, గవర్నర్కు సమర్పించి ప్రజా హక్కుల కోసం పోరాడతాం.ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు కె. ఆర్ మురహరి రెడ్డి ,ఎమ్మిగనూరు మండల కన్వీనర్ బి. ఆర్ బసిరెడ్డి ,గోనెగండ్ల మండల కన్వీనర్ కె. వి కృష్ణ రెడ్డి ,మునిసిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహమ్మద్ , ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప , రాష్ట్ర బిసి సెల్ సంయుక్త కార్యదర్శి వీరుపాక్షి రెడ్డి , రాష్ట్ర సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి రాజారత్నం, రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యదర్శి కాశి రెడ్డి , జిల్లా సోషల్ మీడియా కార్యదర్శి కదిరికోట రాజ్ కుమార్ , సోషల్ మీడియా సభ్యులు జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.


