పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వండి : సిపిఐ
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ భారతికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. రాధాకృష్ణ, మండల కార్యదర్శి జె.మహేష్ అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల హామీ సందర్భంగా చంద్రబాబు నాయుడు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం మంజూరు చేస్తామని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఇంటి నిర్మాణం ఆర్థిక సాయంతో 5 లక్షలకు పెంచాలని, అర్హులైన పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చేవరకు ప్రస్తుతం ఉన్న ఇంటి అద్దెని ప్రభుత్వమే చెల్లించాలి. మరి ఉగాది ప్రకటనలకు పరిమితం కాకుండా లబ్ధిదారుల ందరికి వెంటనే టిడ్క్ ఇల్లు తాళాలు అప్పగించాలి అదేవిధంగా అర్హులైన పేదలకు అన్యాయం చేసే జీవో నెంబర్ 23న వెంటనే వెనక్కి తీసుకోవాలి మరి గతంలో ఇచ్చిన స్థలంలో రోడ్డు,త్రాగునీరు, విద్యుత్,సౌకర్యాలు యుద్ధ ప్రాతిపది కనా కల్పించాలి, అదేవిధంగా భూమిలేని నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేసి, భూమాపియను అరికట్టాలి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,పెన్షన్లు ఇవ్వాలి, పట్టణాల్లో, గ్రామాల్లో దళితవాడలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలన్ని ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రుడు, ఎస్కేవలి, రామకృష్ణ, దాసు, రంగడు, హమాలీలు , ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.

