NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “రైతన్న మీకోసం”- ఎమ్మెల్యే

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని అలేబాద్ తండ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “రైతన్న మీకోసం” కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాల గురించి ఈ సందర్భంగా వివరించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు, ముఖ్యంగా పంచసూత్రాలు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాల ప్రయోజనాలను ఎమ్మెల్యే రైతులకు వివరించారు. అదనంగా రాయితీపై విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగుమందుల సరఫరా విధానాలపై సమగ్ర సమాచారం అందించారు. రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరావు యాదవ్, తెదేపా నాయకులు ఆర్ ఇ నాగరాజు,అదే బాద్ పరమేష్, మండల కన్వీనర్ సుదర్శన్, వ్యవసాయ అధికారి రాజేష్, ఉద్యావనం శాఖ అధికారిణి కల్యాణి, తెదేపా నాయకులు బోచేర్వు పల్లె క్రిష్ణయ్య, రమా క్రిష్ణ రెడ్డి మరియు రైతులు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author