NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గోదావరిపుష్కరాలు -2027 ఇప్పటి నుండే తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి

1 min read

స్నాన ఘట్టాలు అందుకు అనుగుణంగా మిగతా ఏర్పాట్లపై నివేదికలు సిద్ధం చెయ్యాలి

గోదావరిపుష్కరాలు -2027 సమీక్ష సమావేశంలో వివిధ శాఖలు జిల్లా అధికార్లకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి దిశానిర్దేశo

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పోలవరం మండలం పట్టిసీమ టూరిజం రివర్ ఇన్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి అధ్యక్షతన గోదావరి పుష్కరాలు -2027 సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. శాఖలు వారీగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లుపై ఇప్పటికే రెండు పర్యాయములు సమావేశాలు నిర్వహించు కున్నామని అన్నారు. గోదావరి పుష్కరాలు  విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే అన్నిశాఖలు అధికారులు ముందస్తు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ముఖ్యంగా స్నానఘట్టాలను గుర్తించడం, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, వైద్యశిబిరాలు, భద్రత, జనసమూహ నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవలు సమన్వయం చేయడం వంటి అంశాలుపై వివరణాత్మక  నివేదికలు  సిద్ధం చేసుకోవాలని అన్నారు. గతంలో ఉన్న స్నానఘట్టాలు ఈ సారి స్నానఘట్టాలు ఏమైనా పెరిగినాయా, పెంచవలసిన అవసరం ఉందా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రస్తుత స్థానఘట్టాలకు రిపేర్లు ఉన్నచో వాటి పూర్తిస్థాయి అంచనాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేదుకు తగిన ఏర్పాట్లు, పిండప్రదానాలు, దర్శనాలు అనంతరం దగ్గరలో ఏఏ ప్రముఖ దేవాలయాలు వెళ్తారు వివరాలను సిద్ధం చెయ్యాలని అన్నారు.ఈ సమావేశంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీవో యం.వి.రమణ, ఐటిడిఏ పివో కె.రాములు నాయక్, డిఎస్పీ యం.వెంకటేశ్వర రావు, దేవస్థానం పౌండరు వంశస్థులు రాజా కొచ్చర్లకోట వీరభద్రరావు, దేవస్థానం ఇవో సి.హెచ్.వెంకటలక్ష్మి, జిల్లా, డివిజన్, మండల వివిధ శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author