NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బుగ్గ రామేశ్వర దేవాలయాన్ని పరిశీలించిన డీఎస్పీ

1 min read

భద్రతా ఏర్పాట్లపై దిశా నిర్దేశం..

ఓర్వకల్లు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ  శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థాన పరిసర ప్రాంతాలను కర్నూలు డిఎస్పి జే బాబు ప్రసాద్,కర్నూలు రూరల్ సీఐ ఎం చంద్రబాబు నాయుడు దేవస్థానంలోని పరిసర ప్రాంతాలను పరిశీలించారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా  ఈ నెల 14 నుండి 19 వరకు జరుగు శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు.ఆలయ చైర్మన్ నారాయణ,ఆలయ కార్య నిర్వహణ అధికారి మద్దిలేటిని డిఎస్పి అడిగి వివరాలను తెలుసుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వాటి గురించి పోలీసులకు దిశా నిర్దేశం చేశారు.రథోత్సవం జరిగే ప్రాంతంలో మరియు ట్రాఫిక్ తదితర వాటి గురించి సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారికి అప్పజెపాల్సిన విధుల గురించి ఎస్సై యు.సునీల్ కుమార్ కు డిఎస్పీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉలిందకొండ ఎస్ఐ ఏ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

About Author