మార్కెట్ వేలం పాటలో 12.66లక్షలకు దక్కించుకున్న గోల్ల రామ్మోహన్ యాదవ్
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: వేలపాటలో బరిలోకి దిగిన పాటదారులువేలం పాట నాకు దక్కిన నీకు దక్కినగ్రామ పంచాయతీకి 1 లక్ష 18 వేలు ఆదాయం సుంకాలు పెరుగుతాయేమోని వ్యాపారస్తుల ఆందోళనప్యాపిలి గ్రామ పంచాయతీకి సంబంధించి వారపు సంత మార్కెట్టు, దిన కూరగాయల మార్కెట్, బస్టాండ్, కబేల వేలంపాట మేజర్ గ్రామపంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గడ్డం భూవనేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ అభివృద్ధి అధికారి శివకుమార్ గౌడ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.ఉన్నత అధికారులు డోన్ డిడిఓ నరసింహ రెడ్డి,ప్యాపిలి డిప్యూటీ ఎంపీడీవో ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.వారి సమాఖ్య లో వేలం పాట చేపట్టారు.ఈసందర్భంగా పట్టణంలోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వేలంపాటకు గోల్ల రామ్మోహన్ యాదవ్,రామకృష్ణ, రామిరెడ్డి,పులాసి దస్తాగిరి, రాంబాబు,బంగి నాగరాజు, మస్తాన్,కొండప్ప8 మంది పాటదారులు పాల్గొన్నారు. హెచ్చుపాటదారుడైన గొల్ల రామ్మోహన్ రూ.12.లక్షల66 వేలు పాట దక్కించుకోన్నారు. గత సంవత్సరం 11లక్షల 48వేల వేలం పాటను కొంగన పల్లె మదు దక్కించుకున్నారు.ప్రస్తుతం వేలం పాట గోల్ల రామ్మోహన్ యాదవ్ 12లక్షల 66వేలకు దక్కించుకోనగ ప్యాపిలి గ్రామపంచాయతీకి 1 లక్ష 18వేల ఆదాయం చేకూరినట్లు పంచాయితీ అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీకి ఆదాయం పెరిగింది.కానీ వ్యాపారస్తులకు సుంకాలు పెరిగిపోతాయేమో అని చిరు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. సుంకాలు పెరిగితే ప్రస్తుతం వ్యాపారాలు పట్టంలో అంతంత మాత్రమే ఉన్నాయని, సంకలు పెరిగితే సామాన్య మానవుడు పై భారం పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరాల క్రితం నంద్యాల పార్లమెంటు సభ్యులు ఎస్పీ వై రెడ్డి చిరువ్యాపారుల పై భారం పడకుండా ఆయన సుంకాలను గ్రామపంచాయతీకి తమ సొంత డబ్బులను కట్టేవారు చిరు వ్యాపారులకు కాస్త ఊరట నింపేవారు.అలాంటి మహనీయులు ఇంకా రారేమో అని చిరు వ్యాపారస్తులు తెలుపుతున్నారు.ఈ కార్యక్రమంలో వేలంపాట దారులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



