NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గడ్డివాముల అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై సూచనలు

1 min read

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండల ప్రజలకు ముఖ్య సమాచారం: మండలంలోని పలు గ్రామాలలో పశువుల కోసం గడ్డివాములు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఈ వేసవికాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై దిలీప్ కుమార్ సూచించారు.ఈ సంవత్సరం ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల, అలాగే ఎలక్ట్రికల్ వైర్ల రాపిడి వంటి కారణాలతో గడ్డివాముల్లో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇటువంటి ప్రమాదాల వల్ల రైతులకు, పశుపోషకులకు భారీ నష్టం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు.అందువల్ల ప్రజలు తమ గడ్డివాములపై ఎలాంటి కరెంట్ వైర్లు లేకుండా చూసుకోవాలని, గడ్డివాములను తగిన కవర్లతో కప్పి భద్రంగా ఉంచాలని కోరారు. అలాగే గడ్డివాముల దగ్గర అగ్ని ప్రమాదాలకు దారితీసే పదార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 101 లేదా ఫైర్ కంట్రోల్ నెంబర్ 9100108101 కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రజల సహకారంతోనే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు.

About Author