కార్తీక మాసంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు .
1 min read
మహానంది , న్యూస్ నేడు: మహానంది క్షేత్రానికి కార్తీక మాసంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మహానంది దేవస్థానం ఈవో నల్లకాలు శ్రీనివాసురెడ్డి , మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి సంయుక్తంగా మహానంది దేవస్థానం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం కార్తీకమాసంలో నాలుగు సోమవారాలు నాలుగు ఆదివారాలు వచ్చేయన్నారు. క్షేత్రంలో ఈనెల 22వ తేదీ నుండి వచ్చేనెల 20వ తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది అన్నారు. కార్తీకమాసం సందర్భంగా ప్రతిరోజు తెల్లవారుజాము 3 గంటల నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు తెల్లవారుజాము 4 గంటల నుండి నాలుగు గంటల 30 నిమిషాల వరకు మహా మంగళ హారతులు ఉంటాయని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి అన్నారు. మధ్యాహ్నం 12: 30 కి మహా నివేదన అనంతరం రాత్రి 10 నుండి 10: 30 వరకు భక్తులకు స్వామి అమ్మవాళ్ల దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేయడంతో పాటు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు కావాల్సిన త్రాగునీరు తోపాటు బిస్కెట్లు పంపిణీ చేయడానికి ఎన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు. క్షేత్రంలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. వృద్దులు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసామన్నారు. మహానంది రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కార్తీకమాసం సందర్భంగా మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తగిన బందోబస్తు కూడా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆలయంలో కీలక ప్రదేశాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ మల్లయ్య ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.

