వేసవి ని దృష్టిలో ఉంచుకొని నగర ప్రజలకు త్రాగునీటికి ఇబ్బంది కలకూడదు
1 min read

కో- ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు
ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పరిశీలన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సంబంధించిన ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ పనులను నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్ పెదబాబు మంగళవారం పరిశీలించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ పనులు సిబ్బందితో పర్యవేక్షించారు. ఈ వేసవి ని దృష్టిలో ఉంచుకొని నగర ప్రజలకు తాగునీటికి ఏటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పెదబాబు స్థాయి అధికారులకు సిబ్బందికి సూచించారు.ఆయన వెంట మున్సిపల్ ఎం.ఈఈ.సురేంద్రబాబు,ఎలక్ట్రికల్ డి.ఈ నారాయణరావు, ఏ.ఈ లు సాయి,పవన్ కార్పొరేటర్ పాము శామ్యూల్ తదితరులు ఉన్నారు.

