NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాం..

1 min read

రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు, షేర్ షా సూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సూరి మన్సూర్ అలీ ఖాన్

కర్నూలు, న్యూస్​ నేడు:  షేర్ షా సూరి చారిటబుల్ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటామని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు, షేర్ షా సూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సూరి మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ బాలికల ఉర్దూ పాఠశాలలో ట్రస్ట్ తరపున ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ను ఆయన నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా వెయ్యి రూపాయలు, రెండవ బహుమతిగా ఐదు వందల రూపాయలు, మూడో బహుమతిగా మూడు వందల రూపాయలు అందించారు. నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్లను కూడా ప్రధానం చేశారు. అనంతరం సూరి మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ తరఫున వివిధ రకాల సేవా కార్యక్రమాలు కొన్నేళ్లుగా చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఉర్దూ పాఠశాలలో ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ను నిర్వహించడం జరిగిందన్నారు. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని పార్టిసిపేట్ చేయాలని ఆయన కోరారు.

About Author