పత్తికొండలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు : పత్తికొండలో పలుచోట్ల 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మెజిస్ట్రేట్, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో భరత నాయక్, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ హుస్సేన్, స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ జయన్న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పత్తికొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ సార్వభౌమత్వాన్ని ఘనంగా జరుపుకుందాం అన్నారు. ఐక్యత, అభివృద్ధికి ప్రేరణనిస్తూ జాతీయ జెండా ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి. పత్తికొండ నియోజకవర్గం ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

