NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోళగుంద మండలంలో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి ఇంగ్లీష్ పరీక్షలు

1 min read

పరీక్ష అనంతరం ఆనందోత్సాహాలతో బయటకు వచ్చిన విద్యార్థులు

హోలగుందన్యూస్ నేడు: హోలగుంద మండల పరిధిలో ఈ రోజు నిర్వహించిన పదవ తరగతి SSC మార్చి–2026 ఇంగ్లీష్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. మండలంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు సమయానికి హాజరై పరీక్షలను రాశారు.ఈ రోజు నిర్వహించిన 13E & 14E ఇంగ్లీష్ పరీక్షకు మండలంలోని మూడు కేంద్రాల్లో మొత్తం 687 మంది విద్యార్థులకు అవకాశం కల్పించగా, అందులో 676 మంది హాజరై, 11 మంది గైర్హాజరయ్యారు.కేంద్రాల వారీగా హాజరు వివరాలు ఈ విధంగా ఉన్నాయి:జెడ్పీహెచ్‌ఎస్ హోలగుంద A సెంటర్: మొత్తం 257 మంది, హాజరు 252, గైర్హాజరు 5జెడ్పీహెచ్‌ఎస్ హోలగుంద B సెంటర్: మొత్తం 291 మంది, హాజరు 288, గైర్హాజరు 3కేజీబీవీ హోలగుంద: మొత్తం 139 మంది, హాజరు 136, గైర్హాజరు 3పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సిబ్బంది, చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసు సిబ్బంది సమన్వయంతో పరీక్షలు సజావుగా నిర్వహించబడ్డాయి.పరీక్షలు పూర్తి చేసుకుని బయటకు వచ్చిన విద్యార్థులు ఆనందోత్సాహాలతో కనిపించారు. ఒకరితో ఒకరు ప్రశ్నాపత్రం గురించి చర్చించుకుంటూ, సంతోషంగా పరీక్షా కేంద్రాల బయటకు వచ్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు పరీక్ష బాగా రాశామని చెప్పగా, తల్లిదండ్రులు కూడా పిల్లల ఆనందాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు.మండల విద్యాశాఖ అధికారులు పరీక్షలు ప్రశాంతంగా ముగియడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

About Author