వైసీపీ పదవుల్లో ముగ్గురికి చోటు
1 min read

రాష్ట్ర కమిటీలోకి రాముడు,రమణ, రవీంద్రారెడ్డి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: వైయస్సార్సీపి రాష్ట్ర కమిటీ వివిధ విభాగాల్లో నందికొట్కూరు నియోజకవర్గం నుండి ముగ్గురికి చోటు లభించింది. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం రాత్రి పేర్లను విడుదల చేశారు.
రాష్ట్ర నూతన కమిటీలో పేర్ల వివరాలు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని సుంకేసుల గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు కురువ రాముడుకు వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యసిగా అవకాశం కల్పించారు. అదేవిధంగా జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామానికి చెందిన ఎర్రమల వెంకటరమణకు వైసీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం జనరల్ సెక్రటరీగా నియమించారు. కొత్తపల్లి మండలం కొక్కెరంచ గ్రామానికి చెందిన ఏ రవీంద్రారెడ్డికి వైసీపీ రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ సెక్రటరీగా నియమించారు.వీరు ముగ్గురు కూడా వైయస్సార్సీపి యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ముఖ్య అనుచరులు.పార్టీ లో రాష్ట్ర పదవులు కల్పించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మరియు నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధి కోసం అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని వారు అన్నారు.

