NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మైనర్ మరమ్మతులకు భూమి పూజ

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  పత్తికొండ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ముందు ఉన్న పాత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయ భవనంలో చేపట్టనున్నమైనర్ మరమ్మత్తుల పనులకు స్థానిక ఎంఈఓ లు రాజా రామ్మోహన్, రమేష్, మంగళవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాధికారి కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో అవసరమైన మరమ్మత్తులు చేపట్టి,భవనాన్ని మరింత సురక్షితంగా, శుభ్రంగా మరియు ఉపయోగకరంగా మార్చే లక్ష్యంతోపెయింటింగ్, విద్యుత్, త్రాగునీరు, మరుగుదొడ్లు, లీకేజీ తదితర మౌలిక సదుపాయాల మెరుగుదల పనులు చేపట్టనున్నట్లు మండల విద్యాధికారులు ఈ సందర్భంగా వివరించారు.కార్యాలయ భవన అభివృద్ధి మరియు సౌకర్యాల మెరుగుదల లక్ష్యంగామరమ్మత్తుల పనులను త్వరితగతిన ప్రారంభించి,నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తిచేయనున్నట్లు వారు స్పష్టం చేశారు.ఈ మరమ్మత్తుల అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు కార్యాలయానికి వచ్చే ప్రజలుమరింత అనుకూలమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణంలో సేవలు పొందగలరని మండల  విద్యాశాఖ  అధికారులు తెలిపారు.ఈ భూమి పూజ కార్యక్రమంలోMIS రేణుక, DTP జగదీష్, CRMTలు తులసి రెడ్డి, రామాంజనేయులు, కరుణాకర్,మెసెంజర్ వెంకటరాముడు, IERT తేజమరియు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author