దళితులపై దాడి..ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలి
1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : దళితులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామంలో ఆర్.సి.యం చర్చి ప్రాంగణంలోకి గ్రామానికి చెందిన చాకలి పెద్ద హుస్సేన్ కుమారుడు చాకలి రాము మంగళవారం ఉదయం దేవా సురేష్,తమ్మడపల్లె మధుబాబు లను కులం పేరుతో దూషించి అనరాని మాటలతో తిడుతూ కర్రతో వారిపై దాడి చేసి గాయపరచిన చాకలి రాముపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని మిడుతూరు మండలంలోని దళిత సంఘాల నాయకులు మిడుతూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రేణు ప్రసాద్ కు మంగళవారం సాయంత్రం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఆనంద్, ఎమ్మెస్పీ నాయకులు మండల అధ్యక్షుడు వెంకటరమణ, మండల ఇన్చార్జి సతీష్,జిల్లా సీనియర్ నాయకులు గద్దల వెంకటరత్నం మాల మహానాడు నాయకులు దేవరాజు,డేవిడ్,రాజశేఖర్, రంగస్వామి,ప్రసాద్, హరిబాబు తదితర దళిత సంఘాల నాయకులు వినతిపత్రం అంద చేసి వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని వారు అన్నారు.

