భూస్తాపనానికి అవకాశమి వ్వాలని మంత్రికి వినతి
1 min read

సమస్యను పరిష్కరించాలని కోరిన ఆర్ సిఎం విచారణ గురువు..
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న కథోలిక సంఘానికి చెందిన స్మశాన వాటిక స్థలంలో భూస్థాపనం చేయుటకు అనుమతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ను కథోలిక సంఘస్తులు కోరారు.పట్టణంలోని పరిశుద్ధ ఆరోగ్య మాత పుణ్యక్షేత్రం ఆర్ సీఎం విచారణ గురువులు ఫాదర్ కేడీ జోసెఫ్ మరియు సంఘ పెద్దలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రిని కలసి సమస్య గురించి మంత్రికి విన్నవించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి నూనేపల్లే వెళ్లే రోడ్డులో నాగులకట్ట సమీపంలో ఉన్న ఆర్సీఎం చర్చికి సంబంధించిన సమాధుల తోటలో ఎవరైనా చనిపోతే వారిని ఈ తోటలో గత రెండు సంవత్సరముల నుండి భూస్థాపన చేసేవారమని కానీ ఈ మధ్యన రైల్వే శాఖ అధికారులు భూస్థాపన చేయడానికి వీల్లేదని గేటుకు తాళం వేసి బోర్డు పెట్టారని మంత్రికి విన్నవిస్తూ వినతిపత్రం అందజేశారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే శాఖ మరియు కలెక్టర్ తో మాట్లాడుతానని మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డి బాలయ్య, సాలమ్మ,సిస్టర్ రాఖిని,సిస్టర్ లూసీ,విజయానంద్,రవి, జోజప్ప తదితరులు పాల్గొన్నారు.

