NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిటిడీ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలి

1 min read

వైసీపీ ఇన్చార్జి డాక్టర్ సుధీర్ డిమాండ్..

నందికొట్కూరు న్యూస్ నేడు: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ బిఆర్ నాయుడు తన పదవి వెంటనే రాజీనామా చేయాలని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జ్ డాక్టర్ ధారా సుధీర్ డిమాండ్ చేశారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శనివారం ఉదయం చౌడేశ్వరి దేవి ఆలయం బయట వైసిపి నాయకులు నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా డాక్టర్ సుదీర్ మాట్లాడుతూ బిఆర్ నాయుడు తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తూ అశ్లీల అసభ్యకర వ్యవహారాలకు పాల్పడుతున్న బిఆర్ నాయుడును వెంటనే పదవి నుండి తొలగించాలన్నారు.శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన పదవిలో ఉండి బూతురోత కార్యక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు.బిఆర్ నాయుడు అకృత్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్షపూరితంగా దాడులు చేస్తూ కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారని టీటీడీ చైర్మన్ పదవికే బి.ఆర్ నాయుడు కళంకం తెచ్చారని,  వెంటనే ఆయనను తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని నందికొట్కూరు సమన్వయకర్త డా”సుదీర్ డిమాండ్ చేశారు.బిఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. తర్వాత జూపాడుబంగ్లా మండలం తర్తూరులో శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి దేవాలయంలో డాక్టర్ సుధీర్ పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి,అన్వర్ భాష, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *