NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుప్పెడు గుండెను కాపాడుకుందాం

1 min read

‘ జెమ్​ కేర్ ’​ కార్డియాలజిస్టులు  డా. చెరుకు రాఘవేంద్ర,  డా. సుధీర్​ కుమార్​

– హైటెక్నాలజీతో గుండెకు మెరుగైన చికిత్సలు అందిస్తాం..

– జెమ్​ కేర్​ కామినేని సీఈఓ, ఎండి డా. చంద్ర శేఖర్​

కర్నూలు హాస్పిటల్​ , న్యూస్​ నేడు : మ‌నిషి జీవ‌న మ‌నుగ‌డ‌లో కీల‌క‌మైన పాత్ర పోషించేది గుండెనని, అటువంటి గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన  బాధ్యత అందరిపై ఉందన్నారు జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ కార్డియాలజిస్టులు డా. చెరుకు రాఘవేంద్ర, డా. సుధీర్​ కుమార్​.  సెప్టెంబరు 29న ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సోమవారం జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​  సీఈఓ, ఎండి. డా. చంద్ర శేఖర్​ నేతృత్వంలో ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు హాస్పిటల్​ నుంచి రాజ్​ విహార్​ సర్కిల్​ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కార్డియలజిస్టులు మాట్లాడుతూ ఆధునిక సమాజంలో గుండె నొప్పితో బాధ పడే వారు, మరణించే వారి సంఖ్య అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజు వ్యాయామం, పౌష్టిక ఆహారం తీసుకోవాలని,  ఆల్కహాల్​, సిగరేట్​ , ఫాస్ట్​ ఫుడ్​ కు దూరంగా ఉండాలని సూచించారు.  ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న పనిలో శారీరక శ్రమను భాగం చేసుకోవాలన్నారు. స్థూలకాయం వారికి గుండె జబ్బులు త్వరగా వస్తాయని, అటువంటి వారు సైకిల్​ తొక్కడం, రోజు ఉదయం, సాయంత్రం అరగంట నడవడం చేయాలన్నారు. అనంతరం హాస్పిటల్​ ఎండి, సీఈఓ డా. చంద్ర శేఖర్​ మాట్లాడుతూ  ఆధునిక టెక్నాలజీతో గుండెకు చికిత్స చేసే విధానం తమ హాస్పిటల్​ లో ఉందన్నారు. తక్కువ ఖర్చుతోనే మెరుగైన చికిత్స చేస్తామని, వైద్యులు కూడా నిత్యం అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఆ తరువాత ట్రాఫిక్​ సీఐ షుంషుద్దీన్​ మాట్లాడుతూ జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ నేతృత్వంలో  గుండెను కాపాడుకుందాం.. అని అవగాహన ర్యాలీ నిర్వహించడం అభినంనీయమన్నారు.ఆ తరువాత హాస్పిటల్​ లో కేక్​ కట్​ చేసి ,  రోగులకు, సిబ్బందికి అందజేశారు.  కార్యక్రమంలో డాక్టర్లు రవి బాబు,  బాల మురళీ కృష్ణ,  రామ్మోహన్​ రెడ్డి,  పవిత్ర, సునీత  మరియు షేక్షావలి సీఓఓ , జీఎం రమణ,  నదీమ్​ తదితరులు పాల్గొన్నారు.

About Author