NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గొర్రెల కాపరి ఎల్ల రాముడు కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి

1 min read

కర్నూలు జిల్లా కురువ సంఘం

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలోని నేషనల్ హైవే పై కారు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి ఎల్ల రాముడు కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి మృతి చెందిన గొర్రెలకు ఒక్కొక్కటికి ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న, ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల సహకార సంఘం చైర్మన్ కె. ఏ. శ్రీనివాసులు,కల్లూరు సింగిల్ విండో చైర్మన్ పర్ల శేఖర్ సిపిఎం నాయకులు వెంకటరాముడు,,చెట్ల మల్లాపురం వెంకటరాముడు కె. ఈశ్వరయ్య ,కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కె.రంగస్వామి మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడు గ్రామానికి చెందిన ఎల్ల రాముడు అనే గొర్రెల కాపరి ఉలిందకొండ నేషనల్ హైవే రోడ్డు పై గొర్రెలను దాటిస్తుండగా కర్నూల్ నుంచి వేగంగా వస్తున్న కారు గొర్రెల మంద పై దూసుకెళ్లంతో 33 గొర్రెలతో సహా గొర్రెల కాపరి ఎల్ల రాముడు అక్కడికక్కడే  మృతి చెందడం జరిగింది ఎల్ల రాముడికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారని కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం అనాధ అయిందని వారు అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కారు ప్రమాదంలో చనిపోయిన ఎల్ల రాముడు కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్సగ్రేషియా చెల్లించి కుటుంబాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా చనిపోయిన గొర్రెలకు ఒక్కొక్క గొర్రెకు ఇరబై వేలు రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కురువ సంఘం ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ కురువ కులస్తులు కొత్తపల్లి దేవేంద్ర,కుంటనహల్ శివరాం మల్లికార్జున తవుడు శ్రీనివాసులు,కేసీ నాగన్న, బి. సి. తిరుపాల్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు శ్రీలీలమ్మ ప్రదానకార్యదర్శి అనిత, భీష్ముడు, తదితరులు పాల్గొన్నారు.

About Author