NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగనవాడీ లకు మే నెల అంతా సెలవులు మంజూరు చేయాలి

1 min read

సిఐటియు పత్తికొండ మండల ప్రధాన కార్యదర్శి ఎం. రవిచంద్ర డిమాండ్

న్యూస్ నేడు,  పత్తికొండ:  పత్తికొండ నియోజకవర్గ కేంద్రం లోని స్థానిక సిడిపిఓ కార్యాలయంలో ముందు అంగన్వాడీలకు జీతాలు కట్ చేయడంపై సిఐటియు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పత్తికొండ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్  కార్యదర్శి లక్ష్మ, అధ్యక్షతన వహించగా సిఐటియు పత్తికొండ మండల ప్రధాన కార్యదర్శి ఎం. రవిచంద్ర, హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 23 నుంచి రిలే దీక్షలు మార్చి 2 విజయవాడ కార్యక్రమం సందర్భంగా చాలా జిల్లాల్లో ఒక రోజు కన్నా ఎక్కువ రోజులు జీతాలు కట్ చేశారని, మార్చి రెండవ తారీకు రోజు మాత్రమే జీతాలు కట్ చేయండి అని చెప్పి ముందుగానే అధికారులు అందరికీ రాష్ట్ర సిఐటియు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకత్వం తెలియజేసి పాల్గొనడం జరిగిందని అన్నారు. అయినా మిగతా రోజులకు జీతాలు కట్ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెంటర్లు నడుపుతూనే రిలే దీక్షలు చేపట్టడం జరిగిందని, ఇది ప్రతి ఒక్క సిడిపిఓ కు కార్యాలయ సిబ్బందికి కూడా తెలిసిన విషయమేనని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హాలిడే హోలీ రోజు కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కు జీతాలు ప్రభుత్వం కట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అలాగే ప్రీస్కూల్ పిల్లలు సెంటరు పంపించడానికి తల్లి,దండ్రలు ఇష్టపడటంలేదని . ప్రీ స్కూల్ పిల్లలు అనారోగ్యానికి గురౌతున్నారని ఆందోళన చెందు తున్నారని . గర్భిణీ బాలింతలు కూడా సెంటర్కు రాలేకపోతున్నారుని .

About Author