రీ సర్వే పూర్తయిన ఎన్నాళ్ళు వేచి చూడాలి?
1 min read

హోలగుంద న్యూస్ నేడు; గత ప్రభుత్వ హాయంలో 2023 సంవత్సరంలో హోలగుంద మండలంలోని గజ్జహల్లిలో ప్రభుత్వం వారు భూములు రీ సర్వే చేసి ఉన్నారు. అయితే రీ సర్వే చేసిన రెవెన్యూ అధికారులు పూర్తిగా రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విచ్చలవిడిగా సర్వే కొలతలు చేసి సర్వే కొలతలు వేసి అనేక అవకతవకలకు పాల్పడినారని గజ్జహల్లిలో రీసెర్వె పై మాట్లాడుతున్న రైతు ముళ్ళ సుకూర్,, కురువ ఉసేని, బల్దేవ్ రెడ్డి, రామాచారి, గాది లింగారెడ్డి, మా అన్న, గజ్జహల్లి గ్రామ ప్రజలు శుక్రవారం ఆరోపించారు. రైతులు ప్రస్తుతం రైతులు రీ సర్వే నిర్వహించిన తర్వాత పూర్తికాకుండానే కొంతమంది సర్వే అధికారులు గ్రామం నందు మధ్య దళారులతో చేతులు కలిపి ఇష్టానుసారంగా రైతులను నట్టేట ముంచారు. ప్రస్తుతం రైతులు బ్యాంకు లోన్లు ఇతర ఆర్థిక సమస్యల కోసం, భూ కొనుగోలు, అమ్మకాలకు చేయాలనుకున్న ఇబ్బందులకు గురి అవుతున్నారు. అసలు గజ్జహల్లిలో రీసర్వ్ పూర్తయిందా లేదా అని అనుమానం ప్రశ్నార్థకంగా ఉందని ప్రజలు రెవెన్యూ అధికారులను నిరదీశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో జరగని అవినీతి ఇక్కడ మాత్రం కొంతమంది రీసర్వే కొరకు మండలాల నుండి వచ్చిన గ్రామ సర్వేయర్లు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నారని ప్రజలు విమర్శించారు. లక్షలాది రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారే అనుమానం కలుగుతుందని ప్రజలు ఆందోళన చెందారు. కావున జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఆదోని సబ్ కలెక్టర్, హోళగుంద తాసిల్దార్ చర్యలు తీసుకుని రీ సర్వే చేసిన రైతులకు న్యాయం చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.

